నా దృష్టిలోక్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, వీవియన్ రిచర్డ్స్ లెజెండ్స్: విరాట్ కోహ్లీ

by Mahesh |
నా దృష్టిలోక్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, వీవియన్ రిచర్డ్స్ లెజెండ్స్: విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, వీవియన్ రిచర్డ్స్ తన దృష్టిలో క్రికెట్ దిగ్గజాలు అని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. బుధవారం ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్‌ కార్యక్రమంలో భాగంగా కోహ్లీ మాట్లాడిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కోహ్లీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ‘క్రికెట్‌లో దిగ్గజాలంటే నేను ఇద్దరి పేర్లే తీసుకుంటాను. సచిన్ టెండూల్కర్, వివియన్ రిచర్డ్స్. సచిన్ నా హీరో. వీళ్లిద్దరూ తమ బ్యాటింగ్‌తో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.

అందుకే వాళ్లిద్దరూ నా దృష్టిలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అని తెలిపారు. అలాగే, టెన్నిస్ దిగ్గజం రోగర్ ఫెదరర్, ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో టేబుల్ షేర్ చేసుకుంటే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ.. ఇద్దరు క్రీడా దిగ్గజాలు మాట్లాడుకుంటే వింటూ ఉంటానని చెప్పాడు. ‘వామికా ఫొటోలతో నా ఫోన్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది.అనుష్కతో ఉన్నప్పుడు, క్యూట్ పనులు చేస్తున్నప్పుడు.. నడుస్తున్నప్పుడు ఫొటోలు తీస్తుంటాను. ఆమెకు సంబంధించిన అన్ని క్షణాలను నా ఫోన్‌లో బంధిస్తూ ఉంటాను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Next Story