- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rohit Sharma: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కైవసం.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లాండ్ (England) జరిగిన మూడు వన్డేల సరీస్‌ను టీమిండియా (Team India) క్లీన్ స్వీప్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో ఇంగ్లాండ్ (England) జరిగిన మూడు వన్డేల సరీస్‌ను టీమిండియా (Team India) క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిరీస్‌లను క్లీన్‌స్వీప్ (Clean Sweep) చేసిన తొలి భారత సారథిగా రోహిత్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Former Captain Mahindra Singh Dhoni) రికార్డ్‌ను అతడు అధిగమించాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా (Team India) 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
రోహిత్ సారథ్యంలో భారత్ ఇప్పటి వరకు నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. వెస్టిండీస్ (West Indies), శ్రీలంక (Srilanka), న్యూజిలాండ్ (New Zealand)తో పాటు ఇంగ్లండ్ (England)పై సిరీస్‌లను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. గతంలో విరాట్ కోహ్లీ (Virat Kohli), ఎంఎస్ ధోనీ (MS Dhoni)ల నాయకత్వంలో భారత్ మూడేసి సార్లు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా నాలుగు వేర్వేరు దేశాలపై క్లీన్ స్వీప్ చేసిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్‌లో 14 ఏళ్లలో అత్యధిక క్లీన్ స్వీప్‌లను సాధించిన జట్టుగా నిలిచింది. టీమిండియా గత 14 ఏళ్లలో 12 సార్లు వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తర్వాత న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్‌లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.






