ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్ అవ్వాలనుకున్నాడా?

by Harish |

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించే కొంతకాలంగా క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్ అవ్వాలనుకున్నాడా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించే కొంతకాలంగా క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల కెప్టెన్‌గా, ప్లేయర్‌గా విఫలమవుతుండటంతో వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేశాడు. అయినప్పటికీ రోహిత్ రిటైర్మెంట్‌పై ప్రచారం ఆగడం లేదు. తాజాగా రోహిత్ సన్నిహిత వర్గాలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించినట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. నాలుగో టెస్టు అనంతరం హిట్‌మ్యాన్ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది. ‘మెల్‌బోర్న్ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ, సన్నిహితులు అతని మనసును మార్చారు. లేదంటే ఆస్ట్రేలియా పర్యటనలో మరో రిటైర్మెంట్‌ను చూసేవాళ్లం.’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ మధ్య సంబంధాలు బాగా లేవని సదరు జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. జట్టు కూర్పు నుంచి మైదానంలో వ్యూహాల వరకు విబేధాలు తలెత్తినట్టు తెలిపింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే, అతని కెప్టెన్సీలో భారత్ గత 8 టెస్టుల్లో ఆరింట ఓడింది.


Next Story