కొత్త రూల్స్‌పై ప్రశ్న.. ఘాటుగా స్పందించిన రోహిత్

by Harish |

టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో జట్టును గాడిన పట్టేందుకు బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన నియమావళిని తీసుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

కొత్త రూల్స్‌పై ప్రశ్న.. ఘాటుగా స్పందించిన రోహిత్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో జట్టును గాడిన పట్టేందుకు బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన నియమావళిని తీసుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. శనివారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రోహిత్‌ను ఈ రూల్స్‌ గురించి ప్రశ్నించారు. దీంతో హిట్‌మ్యాన్ ఘాటుగా స్పందించాడు. ‘రూల్ గురించి మీకు ఎవరు చెప్పారు?. బీసీసీఐ అధికారికంగా ప్రకటించిందా?. అధికారికంగా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం.’అని చెప్పాడు. అయితే, అజిత్ అగార్కర్ మాత్రం మరోలా స్పందించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటిని పాటించాలన్నాడు. ‘ప్రతి జట్టుకు కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. జట్టులో కొన్ని మార్పులు, జట్టుగా ఉండటం అవసరమని కొంతకాలంగా అనుకుంటున్నాం. శిక్షించడానికి ఇదేం స్కూల్ కాదు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో కావాలి.ఆటగాళ్లు స్కూల్ పిల్లలు కాదు. సూపర్‌స్టార్లు. కానీ, మీరు దేశానికి ఆడుతున్నారని గుర్తుంచుకోవాలి. కాబట్టి, కొన్ని నిబంధనలు పాటించాలి.’ అని చెప్పుకొచ్చాడు.


Next Story