- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెప్టెన్సీ నుంచి తప్పుకో... రోహిత్ శర్మకు బీసీసీఐ ఆదేశాలు ?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ( Rohit Sharma) ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. రోహిత్ శర్మ కు సంబంధిం

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ( Rohit Sharma) ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. రోహిత్ శర్మ కు సంబంధించిన... కీలక పదవులు ఒక్కొక్కటి దూరమవుతున్నాయి. మొన్న టి20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి... ఆటకు దూరమైన రోహిత్ శర్మకు ఇప్పుడు.. షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన వన్డే కెప్టెన్సీ కూడా తొలగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్వయంగా రోహిత్ శర్మనే తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసేలా... స్కెచ్ లు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. చేతికి మట్టి అంటకుండా.. అతని కెప్టెన్సీ తీసివేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు.. రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే వన్డే కెప్టెన్సీ కి.. రాజీనామా చేయాలని... లేకపోతే మేమే తొలగిస్తామని రోహిత్ శర్మకు చెప్పే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి 2027 వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా కొనసాగి... అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని రోహిత్ శర్మ ప్లాన్ వేసుకున్నాడు.
అయితే ఇప్పుడు... రోహిత్ శర్మకు షాకిస్తూ.. కెప్టెన్సీ తీసివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్కెచ్ లు వేస్తోంది. దీంతో ఏం చేయాలో తోచని... పరిస్థితులలో రోహిత్ శర్మ ఉండిపోయారు. అయితే రోహిత్ శర్మను పక్కకు తొలగించి.. శ్రేయాస్ అయ్యర్ కు ( Shreyas Iyer) కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది అట. పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లిన అయ్యర్ కు.. ఇప్పటికే ఈ విషయాన్ని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవేళ రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేస్తే ఆయన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు భయపడిపోతున్నారు. బీసీసీఐ పై ఫైర్ అవుతున్నారు. అంత మంచి కెప్టెన్ ను... తొలగిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
— Sportskeeda (@Sportskeeda) June 10, 2025
There were whispers that Rohit Sharma might be asked to step down as ODI captain, with BCCI expecting him to retire post-Champions Trophy.
But for now, his ODI captaincy is not under threat. 🙌#TeamIndia #ODIs #RohitSharma #Sportskeeda pic.twitter.com/KtA1nPxqFM






