ఆ సీక్రెట్ దాచేసి..రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు - మాజీ సెలెక్టర్

by velandi.Saikiran |

రోహిత్ శర్మ గాయాలపై మాజీ సెలెక్టర్ జతిన్ పరంజపే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయం ఉన్నప్పటికీ... దాచేసి, రోహిత్ శర్మ

ఆ సీక్రెట్ దాచేసి..రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు - మాజీ సెలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : రోహిత్ శర్మ గాయాలపై మాజీ సెలెక్టర్ జతిన్ పరంజపే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయం ఉన్నప్పటికీ... దాచేసి, రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడని... జతిన్ వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్.. విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే ఈ అరుదైన ఘనత సాధించింది టీమిండియా.

ఇలాంటి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడడంపై జతిన్... హాట్ కామెంట్స్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డారని మాజీ సెలెక్టర్ జతిన్ పేర్కొన్నారు. రోహిత్ శర్మ గత ఐదు నుంచి ఆరు నెలలుగా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.

రోహిత్ శర్మకు విశ్రాంతి ఎక్కువ లభించలేదని గుర్తు చేశారు. కానీ మరికొంత కాలం t20, టెస్టులలో ఆడి ఉంటే బాగుండేదని.. అతనిలో ఇంకా సామర్థ్యం ఉందని చెప్పుకొచ్చారు మాజీ సెలెక్టర్ జతిన్. దీనికి ఉదాహరణ ఛాంపియన్స్ ట్రోఫీ అని వెల్లడించారు. గాయం ఉన్నప్పటికీ టోర్నమెంట్ మొత్తం.. ఆడాడని తెలిపారు. ఆ గాయం విషయం సరిగ్గా ఎవరికీ తెలియదని వివరించారు.

Next Story