- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ కెరీర్‌కు 18 ఏళ్లు.. ఎమోషనల్ పోస్టు చేసిన హిట్‌మ్యాన్!
రోహిత్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఎమోషనల్ పోస్టు చేశాడు హిట్‌మ్యాన్!

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ 18 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన తొలి టీమిండియా హెల్మెట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడీ 38 ఏళ్ల దిగ్గజ బ్యాటర్. ‘ఎప్పటికీ కృతజ్ఞుడిని 23/06/07’ అంటూ తన డెబ్యూ డేట్‌ను కూడా పంచుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన వన్డేలో 19-ఏళ్ల రోహిత్ శర్మ అరంగేట్రం చేశాడు. కానీ ఆ మ్యాచులో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు.
అప్పట్లో మిడిలార్డర్ బ్యాటర్, ఆఫ్ స్పిన్ బౌలర్‌గా రోహిత్ ఆడేవాడు. అరంగేట్రం చేసిన మూడ్రోజుల తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా.. కేవలం 8 పరుగులకే అవుటయ్యాడు. 2007-2012 మధ్య మిడిలార్డర్‌లో నిలకడలేక జట్టులో స్థానం కూడా కోల్పోయిన రోహిత్.. 2013లో ఓపెనర్‌గా అవతారమెత్తి ప్రపంచంలోని బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు.






