క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్

by Gantepaka Srikanth |

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుతమైన సెంచరీ చేశారు.

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుతమైన సెంచరీ చేశారు. 76 బంతుల్లో 7 సిక్స్‌లు, 9 ఫోర్లతో సెంచరీ చేశారు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ కాగా, దాదాపు 16 నెలల తర్వాత చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. వన్డేల్లో రోహిత్ శర్మకి రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. 2023 లో ఆఫ్ఘనిస్తాన్‌పై 63 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై 76 బంతుల్లో బాదారు.

అంతేకాదు.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాధిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచారు. వన్డేల్లో 336 సిక్స్‌లు కొట్టిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్‌(331)ను దాటి రెండో స్థానానికి చేరుకున్నారు. 351 సిక్స్‌లతో పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో మొదటినుంచి రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -2025 టోర్నమెంట్ నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ గొప్పగా ఆడటమే కాదు.. పర్వాలేదు అనిపించిన మ్యాచ్ కూడా లేదు. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఒకానొక దశలో రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. వాటన్నింటికీ ఇవాళ సెంచరీతో రోహిత్ సమాధానం చెప్పారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Next Story