Rohith Sharma: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ.. గాయం కారణంగా రోహిత్ శర్మ ఔట్

by Kema Shiva Kumar |

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు గాయమైంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన అతడు రాబోయే రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లుగా తెలుస్తోంది.

Rohith Sharma: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ.. గాయం కారణంగా రోహిత్ శర్మ ఔట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) గాయం కారణంగా రాబోయే రెండు కీలక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ గాయపడ్డారు. నొప్పి తీవ్రం అవ్వడంతో ఆయన మధ్యలోనే ‘రిటైర్డ్ హర్ట్’గా గ్రౌండ్‌ను వీడాడు. వైద్య పరీక్షల అనంతరం, రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించినట్లుగా తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ తదుపరి ఆడబోయే రెండు ముఖ్యమైన మ్యాచ్‌లకు రోహిత్ దూరం కానున్నట్లు తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబైకి ప్రతి మ్యాచ్ కీలకమైన తరుణంలో రోహిత్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు లేకపోవడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రోహిత్ శర్మ గాయం తీవ్రతపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలు ముందున్న నేపథ్యంలో రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవద్దని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే, అతడి ప్లేస్‌లో తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్‌గా మారింది.

Next Story