Yuvraj Singh : రోహిత్, కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడాలి.. : యువరాజ్ సింగ్

by Sathputhe Rajesh |
Yuvraj Singh : రోహిత్, కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడాలి.. : యువరాజ్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : రోహిత్, కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడాలని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సలహా ఇచ్చాడు. ఈ మేరకు గురువారం పీటీఐతో మాట్లాడాడు. ‘దేశవాళీ క్రికెట్ ఆడటం కీలకం. మీకు టైం ఉంటే, లేదా ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటే ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. గాయాలతో ఇబ్బందులు లేకపోతే దేశవాళీ క్రికెట్‌కు సమయం కేటాయించాలి. ప్రాక్టీస్ చేయడానికి అదే అత్యుత్తమమైన మార్గం.’ అని యువరాజ్ సింగ్ అన్నాడు. ఢిల్లీ రంజీ జట్టు తమ ప్రాబబుల్స్‌లో కోహ్లీ పేరును చేర్చింది. మరో వైపు రోహిత్ ముంబై తరఫున బరిలో దిగేందుకు శిక్షణ పొందుతున్నాడు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు రంజీల్లో ఆడే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి, భారత జట్టు కోచ్ గంభీర్ సైతం ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed