- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా?.. ఎందుకు వైదొలిగాడో తెలుసా?
బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దిశ, స్పోర్ట్స్ :బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్టు కథనాలు పేర్కొన్నాయి. వచ్చే అధ్యక్ష ఎన్నికల వరకు శుక్లా బీసీసీఐ రోజు వారీ కార్యక్రమాలు పర్యవేక్షించనున్నారు. దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. బీసీసీఐ అధ్యక్ష పదవీకాలం మూడేళ్లు. 2022 డిసెంబర్‌లో బిన్నీ బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే, ఇటీవలే బిన్నీకి 70 ఏళ్లు నిండాయి. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బీసీసీఐ అధికారుల వయసు పరిమితి 70 సంవత్సరాలు. ఈ నేపథ్యంలోనే బిన్నీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల పార్లమెంట్‌లో నేషనల్ స్పోర్ట్స్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కొత్త చట్టం ప్రకారం జాతీయ సమాఖ్యల అధికారుల వయసు 70 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచారు. అయితే, ఇంకా చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. కాబట్టి, బీసీసీఐ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆ చట్టం అమల్లోకి వస్తే రోజర్ బిన్నీ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు.
- Tags
- Roger Binny
- BCCI






