- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ కెప్టెన్‌గా పరాగ్.. జడ్డూను కాదని పరాగ్‌కే ఓటేసిన యాజమాన్యం
రవీంద్ర జడేజాను కాదని రియాన్ పరాగ్‌కే ఓటేసిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అందించింది.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సంజూ శాంసన్‌ను గతేడాది చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకున్న రాజస్థాన్.. యువ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను తమ కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించింది. వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ జట్టులోకి తిరిగి రావడంతో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ అతన్ని కాదని పరాగ్‌కే ఆర్ఆర్ యాజమాన్యం ఓటేసింది. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పరాగ్.. ఆర్ఆర్ తరఫున సుదీర్ఘ కాలంగా ఆడుతున్న ప్లేయర్లలో ఒకడు. గతంలో సంజూ గాయం కారణంగా ఆడలేనప్పుడు 8 మ్యాచుల్లో రాజస్థాన్‌కు పరాగ్ నాయకత్వం వహించాడు. వీటిలో కేవలం రెండే విజయాలు సాధించిన అతను.. ఆరు ఓటములు మూటగట్టుకున్నాడు. అయినా సరే ఫ్రాంచైజీ అతనిపై నమ్మకముంచి కొత్త కెప్టెన్‌గా నియమించింది. దీనిపై స్పందించిన పరాగ్.. రాజస్థాన్ రాయల్స్ తనకు ఇల్లు వంటిదని, తొలి రోజు నుంచి తనకు ఈ ఫ్రాంచైజీ మద్దతుగా నిలిచిందని చెప్పాడు. ఒక ప్లేయర్‌గా తను ఇంత ఎదగడానికి ఈ ఫ్రాంచైజీనే కారణమన్నాడు.






