- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెమీస్‌లో ఓటమి.. హైలో ఓపెన్ నుంచి ఉన్నతి అవుట్
by Phanindra |
హైలో ఓపెన్ సెమీస్‌లో ఉన్నతి ఘోరఓటమి చవిచూసింది. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ పుత్రి కుసుమ చేతిలో వరుస గేమ్స్ ఓడి ఇంటిదారిపట్టింది.

X
దిశ, స్పోర్ట్స్: యువకెరటం ఉన్నతి హుడా వరుస గేమ్స్ ఓడిపోయి హైలో ఓపెన్ నుంచి నిష్క్రమించింది. ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానీతో జరిగిన మ్యాచులో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఉన్నతి 7-21, 13-21 తేడాతో చిత్తుగా ఓడింది. కేవలం 35 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం గమనార్హం. అక్టోబరులో గువాహతి వేదికగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీం ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున తొలి మెడల్ గెలిచిన జట్టులో ఉన్నతి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె టీం ఆ టోర్నీలో కాంస్యం సాధించింది. ఆ జోష్‌తో హైలో ఓపెన్‌లో అడుగు పెట్టిన ఉన్నతి.. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు దూసుకొచ్చింది. టాప్ సీడ్ పుత్రి కుసుమతో జరిగిన మ్యాచులో అద్భుతంగా ఆడినప్పటికీ, కుసుమ వేగం, కచ్చితత్వాన్ని ఉన్నతి అందుకోలేకపోయింది. దీంతో సెమీఫైనల్స్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Next Story






