Rishabh Pant : మరోసారి విఫలం అయిన రిషబ్ పంత్

by Muthe.Rajitha |

రిషబ్ పంత్(Rishabh Pant) తన ఫ్లాప్ షో మరోసారి కొనసాగించాడు.

Rishabh Pant : మరోసారి విఫలం అయిన రిషబ్ పంత్
X

దిశ, వెబ్ డెస్క్ : రిషబ్ పంత్(Rishabh Pant) తన ఫ్లాప్ షో మరోసారి కొనసాగించాడు. ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) కెప్టెన్ రిషబ్ పంత్ మళ్ళీ తన బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. నేడు SRHతో జరిగిన మ్యాచ్‌లో పంత్ కేవలం 7 పరుగులు చేసి లసిత్ మలింగా బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్‌కు ఔటయ్యాడు. ఈ సీజన్‌లో పంత్ 10 మ్యాచ్‌లలో 110 పరుగులు మాత్రమే చేశాడు. వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధర పలికిన పంత్ కు ఇవన్నీ ఏ మాత్రం మ్యాచ్ అవని ఫ్లాప్ ప్రదర్శనలుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ సీజన్‌లో పంత్ 32 బంతులు ఆడి 19 పరుగులతో 4 సార్లు ఔటయ్యాడు. సగటు 4.75, స్ట్రైక్ రేట్ 59.37గా ఉంది. ఇది T20 ఫార్మాట్‌లో ఆట తీరుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపికపై ఈ ఆటతీరు ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే LSG పాయింట్ల టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. పంత్ వ్యక్తిగత ప్రదర్శన అభిమానులను, యజమాని సంజీవ్ గోయెంకాను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

Next Story