- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా కప్‌కు సెలెక్ట్ కానని భయపడ్డా : రింకు సింగ్
గతేడాది తాను పెద్దగా రాణించలేకపోవడంతో ఆసియా కప్‌కు ఎంపిక కానేమోనని భయపడ్డాడనని టీమిండియా యువ బ్యాటర్ రింకు సింగ్ తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : గతేడాది తాను పెద్దగా రాణించలేకపోవడంతో ఆసియా కప్‌కు ఎంపిక కానేమోనని భయపడ్డాడనని టీమిండియా యువ బ్యాటర్ రింకు సింగ్ తెలిపాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రింకు మాట్లాడుతూ.. తాను సెలెక్ట్ అవుతానని ఊహించలేదన్నాడు. ‘ఆసియా కప్ లిస్ట్‌లో నా పేరు చూసి స్ఫూర్తి పొందా. గతేడాది నేను బాగా ఆడలేదు. కాబట్టి, చోటు దక్కదని భావించా. కానీ, సెలెక్టర్లు నన్ను నమ్మారు. అది నాలో ఆత్మవిశ్వాసం నింపింది. యూపీ టీ20 లీగ్‌లో ఆడిన ఇన్నింగ్స్ నాలో నమ్మకాన్ని పెంచింది. ఆసియా కప్‌లో కూడా అలాగే రాణిస్తా.’అని తెలిపాడు.
ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ మల్టీ స్కిల్స్ ఉన్న ప్లేయర్లకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పాడు. ‘ఈ రోజుల్లో బౌలింగ్ చాలా కీలకం. సెలెక్టర్లు జట్టులో మల్టీపుల్ రోల్స్ పోషించాలని కోరుకుంటున్నారు. బ్యాటుతో ప్రభావం చూపించకపోయినా బంతితో రాణించొచ్చు.’అని తెలిపాడు. అలాగే, జట్టులో తన రోల్ గురించి మాట్లాడుతూ.. ఫినిషర్ రోల్ తనకు గుర్తింపునిచ్చిందన్నాడు. కానీ, తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలనని తెలిపాడు.‘2023లో నేను నం.5 బ్యాటింగ్ చేశాను. నం.7, 8లలో బ్యాటింగ్ ఆస్వాదించలేదు. జట్టు అవసరాన్ని బట్టి మన పాత్ర ఉంటుంది. టీమిండియా తరపున నేను 33 టీ20లు ఆడాను. మూడు హాఫ్ సెంచరీలు చేశాను. ఫినిషర్ రోల్‌లోనే కాదు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలను.’అని రింకు చెప్పుకొచ్చాడు.






