ప్లే ఆఫ్స్ కంటే ముందు RCB కి అదిరిపోయే గుడ్ న్యూస్

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IP L 2025) నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) మరో

ప్లే ఆఫ్స్ కంటే ముందు RCB కి అదిరిపోయే గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IP L 2025) నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో.. అత్యధిక ఫాలోవర్స్ కలిగిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రికార్డు సృష్టించింది. తాజాగా 20 మిలియన్ ఫాలోవర్స్ ను ఇంస్టాగ్రామ్ ( Instagramme) వేదికగా సంపాదించుకుంది. దీంతో 20 మిలియన్స్ ఫాలోవర్స్ ( 20M INSTAGRAM FOLLOWERS) సంపాదించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది బెంగుళూరు.

బెంగళూరు తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండవ స్థానంలో ఉంది. ఈ జట్టుకు ఇంస్టాగ్రామ్ లో 18.6 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ (MI) 18 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది. నాలుగో స్థానంలో కేకేఆర్ నిలిచింది. ఈ జట్టుకు 7.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మన తెలుగు జట్టు హైదరాబాద్ కు ఇంస్టాగ్రామ్ లో 5.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మిగిలిన జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత 18 సీజన్లుగా ఒక్క కప్ గెలవకపోయినా కూడా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోసారి కప్ కొట్టకపోయిన ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గదు. దీనంతటికీ ముఖ్య కారణం విరాట్ కోహ్లీ. ఆ జట్టులో విరాట్ కోహ్లీ ఉండడంతో ఫ్యాన్స్ విపరీతంగా పెరుగుతున్నారు.

Next Story