రాజస్థాన్ చిత్తు.. పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan) జట్టును చిత్తు చేసింది పంజాబ్ కింగ్స్. (

రాజస్థాన్ చిత్తు.. పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan) జట్టును చిత్తు చేసింది పంజాబ్ కింగ్స్. ( Punjab kings) జైపూర్ వేదికగా జరిగిన 59వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ 2025 పునః ప్రారంభంలో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో... నేహళ్ వదేరా 37 మంత్రుల్లోనే 70 పరుగులతో దుమ్ము లేపాడు. ఇందులో 5 సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. అలాగే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేశాడు.

చివరలో శశాంక్ సింగ్ 59 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఈ దెబ్బకు 219 పరుగులు చేయగలిగింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దాటిగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు... వచ్చేసరికి చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 209 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పది పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయం నేపథ్యంలో... రెండో స్థానానికి చేరుకున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది.

Next Story