- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: అంధ క్రికెటర్లకు స్వీట్స్ తినిపించిన ప్రధాని మోడీ
టీ20 ప్రపంచ కప్ గెలిచిన అంధుల మహిళల భారత జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. విజేతలైన భారత

Prime Minister Narendra Modi hosted the Indian Blind Women's Cricket Team, winners of the inaugural T20 World Cup, at his residence at Lok Kalyan Marg.
దిశ, వెబ్ డెస్క్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన అంధుల మహిళల భారత జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. విజేతలైన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టుకు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగానే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని భారత అంధుల మహిళా క్రికెటర్లు కలిశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ క్రికెటర్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురు అయ్యాయని ప్లేయర్లను ఆడిగి తెలుసుకున్నారు మోడీ.
ఫైనల్స్ గెలవడంపై వాళ్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరికీ స్వీట్లు తినిపించారు. వారితో కూర్చొని సరదాగా ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోడీ. తదనంతరం భారత మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్ ను ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా అందించారు. అటు టీ20 వరల్డ్ కప్ ను ప్రధాని నరేంద్ర మోడీకి చూపించి మురిసిపోయారు ప్లేయర్లు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇటీవల కాలంలో 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ కూడా హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత మహిళలు జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అంధుల టీ20 ప్రపంచ కప్ కూడా మన భారత మహిళలు గెలుచుకున్నారు. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ కీలక పోరులో నేపాల్ పైన ఏకంగా 7 వికెట్ల తేడాతో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో తొలిసారిగా టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది భారత్.






