బాలీవుడ్ బ్యూటీకి హగ్..వివాదంలో 14 ఏళ్ళ కుర్రాడు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-21 12:29:26  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో... 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) సోష

బాలీవుడ్ బ్యూటీకి హగ్..వివాదంలో 14 ఏళ్ళ కుర్రాడు !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో... 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో వేగంగా సెంచరీ చేయడమే కాకుండా వరుసగా... హాఫ్ సెంచరీలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు వైభవ్. అటు ఈ 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ చూసి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫిదా అయిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా భారీ నజరాన ప్రకటించారు.

అయితే ఇంతటి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తున్న 14 ఏళ్ల వైభవ్... కొత్త వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ( Preity Zinta )... ఈ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ ను హగ్ చేసుకున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రీతిజింటా పై దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. 50 ఏళ్లు దాటిన నీకు 14 ఏళ్ల కుర్రాడు అవసరమా? అన్నట్టు రెచ్చిపోయారు నెటిజెన్స్.

అయితే ఈ హగ్గు వివాదం పై నేరుగా పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా స్పందించారు. తాను హాగ్ అస్సలు ఇవ్వలేదని.. మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి... పోలింగ్ చేస్తున్నారని ఫైర్ అయింది. తాను హగ్ ఇచ్చినట్లు చాలా వెబ్సైట్స్ ఆర్టికల్స్ రాసాయని... వాటిని చూసి తాను షాక్ అయినట్లు వెల్లడించారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని... తప్పుడు కథనాలు ప్రచురించకూడదని హెచ్చరించారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసింది.

https://x.com/realpreityzinta/status/1924674409899704748

Next Story