- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశీ
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశీ
పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు(Power lifting athlete) మోడెం వంశీ(Modem Vamsi) జుబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు(Power lifting athlete) మోడెం వంశీ(Modem Vamsi) జుబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రాచలంకు చెందిన మోడెం వంశీ ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా కామన్వెల్త్ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. తాను సాధించిన గోల్డ్ మెడల్ ను వంశీ సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. పవర్ లిఫ్టింగ్ వంశీ సాధించిన ఘనతను రేవంత్ రెడ్డి అభినందించారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలతో దేశానికి, రాష్ట్రానికి పేరు తేవాలని, ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం ఉంటుందన్నారు. వంశీ వెంట అతని కుటుంబ సభ్యులతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డిలు ఉన్నారు.
Next Story






