National Games : నేషనల్ గేమ్స్ లో తొలిసారి ఆ పోటీలు

by Muthe.Rajitha |

ఉత్తరాఖండ్‌(Utharakhand)లోని డెహ్రాడూన్‌(Dehradune)లో 38వ నేషనల్‌ గేమ్స్‌(38th National Games) మంగళవారం సాయంత్రం అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి.

National Games : నేషనల్ గేమ్స్ లో తొలిసారి ఆ పోటీలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌(Utharakhand)లోని డెహ్రాడూన్‌(Dehradune)లో 38వ నేషనల్‌ గేమ్స్‌(38th National Games) మంగళవారం సాయంత్రం అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళాకారుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) 38వ జాతీయ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి(CM Pushkar Singh Dhami) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ తప్పకుండా 2036 నాటికి ఒలింపిక్స్‌ను నిర్వహిస్తుందన్నారు. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ‘నేషనల్ గేమ్స్’ అని పేర్కొన్నారు.

అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం(Rajeev Gandhi Cricket Stadium) చేరుకున్నారు. ప్రధాని మోడీ ప్రత్యేకంగా రూపొందించిన రథంపై స్టేడియంలోకి ప్రవేశించారు. ఈ వేదికపై ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే, అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి, పీటీ ఉష(PT Usha) తదితరులు హాజరయ్యారు. సీఎం ధామి కూడా ప్రధానికి పుష్పగుచ్ఛం, టోపీ, శాలువా అందజేశారు. అంతకుముందు, ప్రధాని మోడీ ఆటగాళ్లు లక్ష్యసేన్, మనీష్ రావత్, జస్పాల్ రాణా, సురేంద్ర కన్వాసి, హంసా మన్రాల్, హితేంద్ర రావత్, సుభాష్ రాణా, మనోజ్ సర్కార్‌లను కూడా కలిశారు.

ఉత్తరాఖండ్‌ తొలిసారి నేషనల్‌ గేమ్స్‌ను నిర్వహిస్తోంది. ఈసారి గ్రీన్‌ గేమ్స్‌(Green Gmaes) థీమ్‌తో నేషనల్‌ గేమ్స్‌ను నిర్వహిస్తున్నారు. గేమ్స్‌ విలేజ్‌ బయట 10 వేల మొక్కలను క్రీడాకారులు నాటారు. ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. 32కి పైగా వివిధ క్రీడా విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీలో పాల్గొంటున్నారు. వీరిలో 49 శాతం మంది మహిళలు. అయితే నేషనల్‌ గేమ్స్‌లో తొలిసారి యోగా పోటీలను(Yoga Competitions) నిర్వహిస్తున్నారు. రాష్ట్ర జట్లతో పాటు, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, సర్వీసెస్‌కు చెందిన క్రీడా జట్లు కూడా జాతీయ క్రీడల్లో పాల్గొంటాయి.

Next Story