- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంపియన్స్ ట్రోఫీ విజయంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..
అసాధారణమైన ఆటతో అసాధారణ ఫలితాన్ని సాధించారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు మన క్రికెట్ జట్టుకు అభినందనలు.

చాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకొని వచ్చినందుకు టీమ్ ఇండియా పట్ల గర్వంగా ఉంది. ఈ టోర్నమెంట్ అంతటా వాళ్లు అద్భుతంగా ఆడారు. అసాధారణమైన ఆటతో అసాధారణ ఫలితాన్ని సాధించారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు మన క్రికెట్ జట్టుకు అభినందనలు.
- ప్రధాని నరేంద్ర మోడీ
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు. క్రికెట్ చరిత్రలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించడం ఆనందకరమైన క్షణం. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లలో జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యేక అభినందనలు. అత్యుత్తమ ప్రదర్శన జట్టు మొత్తానికి అభినందనలు.
- రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం
మన మెన్ ఇన్ బ్లూ సాధించిన అద్భుతమైన విజయాన్ని వేడుకగా చేసుకోవడంలో దేశంతో పాటు నేను కూడా చేతులు కలుపుతున్నాను. టీమ్ ఇండియా తన అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి మనల్ని గర్వపడేలా చేసింది. వారి కృషి, అంకిత భావం, అత్యుత్తమ విజయానికి అభినందనలు.
- నారా చంద్రబాబు నాయుడు, సీఎం ఆంధ్రప్రదేశ్






