- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ జట్టుకు మరో ఎదురుదెబ్బ...ఆ సర్టిఫికెట్లు రద్దు
విదేశీ టి20 లీగ్స్ అలాగే టోర్నమెంట్స్ లో ఆడేందుకు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తాజాగా రద్దు చేస్తూ

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా చేతిలో దారుణంగా ఓడిన పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ జట్టుకు PCB తాజాగా షాక్ ఇచ్చింది. విదేశీ టి20 లీగ్స్ అలాగే టోర్నమెంట్స్ లో ఆడేందుకు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తిరిగి ఆదేశాలు ఇచ్చేవరకు... ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడించింది పీసీబీ.
ఈ నిర్ణయానికి ప్రత్యేకమైన కారణం మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేయలేదు. ముందు అంతర్జాతీయంగా మీ సత్తా నిరూపించుకోండి... ఆ తర్వాత ఇతర లీగ్‌లలో ఆడండి...అంటూ పాకిస్తాన్ క్రికెటర్లకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన క్రికెటర్లు ఊహించని షాక్ తిన్నారు. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో... కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న పాకిస్తాన్... ఫైనల్ లో తిలక్ వర్మ దెబ్బకు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా తొమ్మిదవ సారి ఛాంపియన్ అయిన సంగతి తెలిసిందే.






