Mohsin Naqvi: ఏం చేస్తారో చేయండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించండి !

by velandi.Saikiran |

ACC, PCB ఛైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏం చేస్తారో చేయండి... మ్యాచ్ మాత్రం గెలవాల్సిందేన‌ని

Mohsin Naqvi: ఏం చేస్తారో చేయండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించండి !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ACC, PCB ఛైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏం చేస్తారో చేయండి... మ్యాచ్ మాత్రం గెలవాల్సిందేన‌ని పాకిస్థాన్ ప్లేయ‌ర్ల‌ను ఆదేశించార‌ట మొహ్సిన్ నఖ్వీ. మ్యాచ్ లో చేత‌నైంది చేయండి.. ఏం జ‌రిగినా నేను చూసుకుంటా... కానీ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించాల‌ని స్ప‌ష్టం చేశారట‌. దీనికి సంబంధించిన న్యూస్ వైర‌ల్ గా మారింది.

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా.. ఇవాళ పాకిస్థాన్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక‌గా.. ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఇలాంటి త‌రుణంలోనే... PCB ఛైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. పాకిస్థాన్ ప్లేయ‌ర్లు ఉన్న హోట‌ల్ కు వెళ్లి...కీల‌క చ‌ర్చ నిర్వహించార‌ట‌. ఏది చేసైనా టీమిండియాను ఓడించాల‌ని ఆదేశాలు ఇచ్చార‌ట‌. రెచ్చిగొట్టి మ్యాచ్ గెల‌వండి అంటూ పేర్కొన్నార‌ట‌. కాగా.. ఈ టోర్న‌మెంట్ ఇప్ప‌టికే రెండు సార్లు టీమిండియా చేతిలో పాకిస్థాన్ దారుణంగా ఓడింది. ఫైన‌ల్ కూడా ఇవాళ పాక్ ఓడిపోతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Next Story