- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్తాన్ యూటర్న్
టీ20 ప్రపంచకప్-2026లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్తాన్ జట్టు యూటర్న్ తీసుకుంది. మ్యాచ్‌కు రెడీ అని ఐసీసీకి సంకేతాలు పంపించినట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్-2026లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్తాన్ జట్టు యూటర్న్ తీసుకుంది. మ్యాచ్‌కు రెడీ అని ఐసీసీకి సంకేతాలు పంపించినట్లు సమాచారం. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 15వ తేదీన కొలంబో మైదానం వేదికగా మ్యాచ్ జరుగనుంది.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ vs పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాలంటే కొన్ని డిమాండ్లు పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇందులో మొదటిది.. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు గురైన నేపథ్యంలో ఆ బోర్డుపై ఫైన్ వేయకూడదని పాకిస్తాన్ కోరడం, జరిగే అండర్-19 వరల్డ్ కప్‌ను బంగ్లాదేశ్‌లో జరిగేలా చూడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు డిమాండ్లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ప్రతిపాదనను ICC రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా, పాక్, బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్ పెట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరగా.. దానిని కూడా రిజెక్ట్ చేసింది ఐసీసీ. బంగ్లాదేశ్‌లో ఇండియా పర్యటించడానికి కూడా రిజెక్ట్ చేసింది. అంటే ఐదు డిమాండ్లకు గాను మొత్తం మూడు డిమాండ్లకు ఐసీసీ అస్సలు ఒప్పుకోలేదు. రెండు మాత్రమే ఒప్పుకుంది. ఆ రెండు ఓకే అయితే ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్‌కు దిశానిర్దేశం చేసింది ఐసీసీ.






