పాకిస్తాన్ కు డూ ఆర్ డై...ఇవాళ ఓడితే బ్యాగులు స‌ర్దుకోవాల్సిందే !

by velandi.Saikiran |

పాకిస్తాన్ కు డూ ఆర్ డై...ఇవాళ న‌మీబియా చేతిలో ఓడితే పాకిస్తాన్ ఇంటి దారి ప‌ట్ట‌నుంది.

Pakistan face must win clash against Namibia to stay alive in T20 World Cup
X

Pakistan face must win clash against Namibia to stay alive in T20 World Cup

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇవాళ మూడు కీలక మ్యాచ్ లు జరగబోతున్నాయి. మొదటగా దక్షిణాఫ్రికా, యూఏఈ ( UAE) జట్ల మధ్య తొలి ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభం కానుండ‌గా, అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఇక మధ్యాహ్నం మూడు గంటలకు పాకిస్తాన్, నమీబియా మధ్య చాలా కీలకమైన మ్యాచ్ జరగనుంది. కొలంబో ఈ మ్యాచ్ కు వేదిక అవుతుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. నమీబియా చేతిలో ఓడిపోతే మాత్రం, సూపర్ 8 ఛాన్స్ కోల్పోతుంది పాకిస్తాన్. గ్రూప్ A లో మరో జట్టు సూపర్ 8కు వెళ్లే అవకాశం ఉంటుంది.

పాకిస్తాన్ కు డూ ఆర్ డై

ఇప్పటికే భారత జట్టు సూప‌ర్ 8 అర్హత సాధించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పాకిస్తాన్ రెండో స్థానం కోసం తలపడుతున్నాయి. ఇవాళ నమీబియా పైన పాకిస్తాన్ విజయం సాధిస్తే, నేరుగా సూపర్ 8 లోకి అడుగుపెట్టనుంది. ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే బ్యాగులు సర్దుకోవాలి. అప్పుడు ర‌న్ రేట్ ఆధారంగా USA సూపర్ 8 ఛాన్స్ కొట్టేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక అటు ఇవాళ రాత్రి ఇండియా, నెద‌ర్లాండ్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.

Next Story