- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup: సెంచరీతో చెలరేగిన పాకిస్తాన్ ఓపెనర్.. శ్రీలంక ఎదుట భారీ టార్గెట్
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు అదరగొట్టారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా రప్ఫాడించారు.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు అదరగొట్టారు. శ్రీలంక బౌలర్లపై ఓపెనర్లు ఇద్దరూ విరుచుకుపడ్డారు. సహిబ్దాద ఫర్హాన్(100) సెంచరీతో రాణించగా, ఫకర్ జమాన్(84) హాఫ్ సెంచరీతో చెలరేగారు. మొత్తంగా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ జట్టు 212 పరుగులు చేసింది. శ్రీలంక విజయం సాధించాలంటే 213 పరుగులు చేయాలి. లంక బౌలర్లలో మధుశంక మూడు వికెట్లు, దాషున్ శనక రెండు వికెట్లు, దుష్మంత చమీరా ఒక తీశారు. ఇద్దరు రన్ ఔట్ అయ్యారు. అయితే.. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే కనీసం 65 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి. పాక్ సెమీస్‌కు వెళితే.. న్యూజిలాండ్ ఇంటికి వెళ్లనుంది. భారీ మార్జిన్‌తో పాక్ గెలవకపోతే.. న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్లనుంది. ఈ ఒక్క మ్యాచ్ రెండు జట్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. దీంతో క్రీడాకారులంతా ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకిస్తున్నారు.
పాకిస్తాన్ జట్టు: షాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), ఖవాజ్ నఫాయి, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షాఫ్, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సంక, కుశాల్ మిషారా, చరిత అసలంక, కుశాల్ మెండిస్, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దాషున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, జనిత్ లియానగే, దుష్మంత చమీరా, మహీష్ తీక్షణ, దిల్షాన్ మధుశంక.






