Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో రద్ధయిన పాక్ - బంగ్లా లీగ్ మ్యాచ్

by Y. Venkata Narasimha Reddy |

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)ని ఆతిథ్య పాకిస్థాన్(Pakistan)జట్టు ఎంతమాత్రం కలిసిరాలేదు. ఢిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్ జట్టు తొలి రెండు లీగ్ మ్యాచ్ లో ఓడి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది

Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో రద్ధయిన పాక్ - బంగ్లా లీగ్ మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)ని ఆతిథ్య పాకిస్థాన్(Pakistan)జట్టు ఎంతమాత్రం కలిసిరాలేదు. ఢిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్ జట్టు తొలి రెండు లీగ్ మ్యాచ్ లో ఓడి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. చివరి లీగ్ మ్యాచ్ గురువారం (PAK vs BAN) బంగ్లాదేశ్ తో జరుగాల్సి ఉండగా వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్ధయ్యింది. దీంతో చివరి లీగ్ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకున్న పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లినట్లయ్యింది.

మ్యాచ్ రద్ధవ్వడంతో ఒక్క విజయం లేకుండానే పాకిస్తాన్ జట్టు టోర్నీని ముగించింది. గురువారం రావల్పిండిలో ఉదయం నుంచి వర్షం కురవడంతో మైదానమంతా చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్ మొత్తం జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. టాస్ కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయించారు. రావల్పిండిలో మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (AUS vs SA) మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణమైన విషయం తెలిసిందే.

అటు బంగ్లాదేశ్ జట్లు కూడా పాకిస్థాన్ మాదిరిగానే ఒక్క విజయం లేకుండానే టోర్నీని ముగించింది. టోర్నీలో గ్రూప్ ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ కే చేరాయి. ఆదివారం టీమ్ ఇండియా, కివీస్ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలుస్తుంది. గ్రూప్ బీలో ఇంగ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోన ఓడి సెమీస్ కు దూరమైంది. రెండు మ్యాచ్ లు ఆడిన అసీస్, దక్షిణాఫ్రికాలు చెరో విజయం సాధించాయి. అసీస్ పాయింట్లు, దక్షిణాఫ్రికా 3పాయింట్లు, అప్ఘానిస్తాన్ 2పాయింట్లతో సెమిస్ రేసులో ఉన్నాయి.

Next Story