- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ డెసిషన్ తీసుకున్న న్యూజిలాండ్ మహిళా క్రికెటర్
by Harish |
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ థమిస్న్ న్యూటన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ థమిస్న్ న్యూటన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కే కాకుండా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించింది. 14 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికింది. 2015-2021 మధ్య న్యూజిలాండ్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించింది. 10 వన్డేలు, 15 టీ20లు ఆడిన న్యూటన్ 20 వికెట్లు తీసింది. 2016 టీ20 వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్ ఆడిన కివీస్ జట్లలో ఆమె సభ్యురాలు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినా దేశవాళీలో మాత్రం ఆమెకు ఘనమైన రికార్డు ఉంది. కాంటర్‌బరీ, వెల్లింగ్టన్ తరపున హాలీబర్టన్ జాన్‌స్టోన్ షీల్డ్ టోర్నీని నెగ్గింది. అలాగే, వెల్లింగ్టన్ తరపున నాలుగుసార్లు సూపర్ స్మాష్ గెలిచింది.
Next Story






