- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్, పాక్ మ్యాచ్.. నారా లోకేష్ ఫోటోలు వైరల్
కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బ్లూ జెర్సీలో మెరిశారు.

దిశ, వెబ్ డెస్క్: కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజు జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి భారత జట్టు విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఈ కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా 61 పరుగులు తేడాతో విజయం సాధించింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత జట్టు జెర్సీలో మెరిసిన నారా లోకేష్
కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బ్లూ జెర్సీలో మెరిశారు. భారత జెర్సీలో కనిపించిన నారా లోకేష్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కొలంబో వేదికగా ఇండియా, పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకుగాను నారా లోకేష్, పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు, ఆయన మిత్రులు కొలంబో వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక స్టేడియానికి వెళ్లిన నారా లోకేష్ బృందం, ఇండియన్ జెర్సీని ధరించింది. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ తన పేరుపైన ఉన్న జెర్సీ ధరించి, భారత జెండాను చూపిస్తూ జట్టుకు సపోర్టుగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు నారా లోకేష్. కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు తాను వచ్చానని పేర్కొన్నారు.
ఇక పాకిస్తాన్ పై భారత జట్టు విజయం సాధించిన తర్వాత కూడా నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. భారత జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కొలంబో మ్యాచ్ లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు.. అతని ఇన్నింగ్స్ కారణంగా ఇండియా ఇవాళ గెలిచిందని కొనియాడారు నారా లోకేష్. భయం లేని బ్యాటింగ్ తో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడని వెల్లడించారు. అటు భారత జట్టుకు సంబంధించిన బౌలర్లు కూడా ఇరగదీశారు. వాళ్ల వల్ల ఇండియా 61 పరుగులు తేడాతో విజయం సాధించిందని ప్రశంసించారు. ఈ విజయం భారత గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపారు. ఇదే ఊపుతో టీ20 వరల్డ్ కప్ గెలవాలని కూడా పోస్ట్ పెట్టారు నారా లోకేష్. అటు ఇండియా గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్న వీడియోను కూడా పంచుకున్నారు నారా లోకేష్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఇషాన్ కిషన్ 77 పరుగులు సాధించాడు. దీంతో అతినికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక పాకిస్తాన్ పై గెలిచిన భారత్ జట్టు, సూపర్ 8 కు కూడా దూసుకెళ్లింది.






