- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రూమర్ పచ్చి అబద్ధం.. కెరీర్ తొలి నాళ్లలో వచ్చిన పుకారుపై స్పందించిన ధోనీ
భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తన కెరీర్ తొలినాళ్లలో వచ్చిన రూమర్‌పై తాజాగా స్పందించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తన కెరీర్ తొలినాళ్లలో వచ్చిన రూమర్‌పై తాజాగా స్పందించాడు. చెన్నయ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని యాంకర్ ‘మీ గురించి వచ్చిన ఏ రూమర్ విని బాగా నవ్వుకున్నారు.’ అని అడిగింది. దీనికి ధోనీ నవ్వుతూ బదులిస్తూ. ‘ప్రతి రోజు నేను ఐదు లీటర్ల పాలు తాగుతాను’ అనే పుకారు తనకు నవ్వు తెప్పించేదని చెప్పాడు. ఆ రూమర్ అబద్ధమని స్పష్టతనిచ్చాడు. రోజంతా ఒక లీటర్ పాలు తాగేవాడిని, కానీ, ఐదు లీటర్లు అంటే ఎవరికైనా కష్టమేనని చెప్పాడు.
Finishing off the rumour in style! 🥛 #WhistlePodu #Yellove🦁💛 @fedexmeisa pic.twitter.com/JPKTramxl7
— Chennai Super Kings (@ChennaiIPL) April 22, 2025
కెరీర్ తొలి నాళ్లలో ధోనీ పవర్ హిట్టర్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అలవోకగా సిక్సర్లు కొట్టేవాడు. దీంతో అతని ఫిట్‌నెస్, డైట్ గురించి చాలా వదంతులు వ్యాపించాయి. ధోనీ ఫిట్‌నెస్‌కు ప్రతి రోజు ఐదు లీటర్ల పాలు తాగడమే కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఈ పుకారును ధోనీ కొట్టిపారేశాడు. అలాగే, వాషింగ్ మెషీన్‌లో లస్సీ తయారు చేసుకునేవారట కదా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ రూమరను కూడా ధోనీ కొట్టిపారేశాడు. తాను అసలు లస్సీనే తాగనని తెలిపాడు.
- Tags
- MS Dhoni






