- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్స్ కు భారత్ చేరడం వెనుక చక్రం తిప్పిన ధోని..భజన షురూ !
ఫైనల్స్ కు భారత్ చేరడం వెనుక ధోని చక్రం తిప్పాడని పోస్టులు వైరల్ చేస్తున్నారు తలా ఫ్యాన్స్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ అడుగు పెట్టింది. అందరూ ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ ను చిత్తు చేసి, ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది సూర్య కుమార్ యాదవ్ సేన. ముంబై వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సెమీ ఫైనల్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి క్షణంలో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది భారత జట్టు. దీంతో ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టగా, న్యూజిలాండ్ తో ఫైనల్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్, ఇంగ్లీష్ బ్యాటర్ల ముందు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుతంగానే ఇంగ్లాండ్ ఆటగాళ్లు రాణించారు. జాకబ్ బెథెల్ ఒక్కడే 48 బంతుల్లో 105 పరుగులు చేసి, భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ చివరలో అతడు కూడా చేతులెత్తేశాడు. దీంతో ఇండియా గెలిచింది.
భారత్ ఫైనల్ కు వెళ్లడం వెనుక చక్రం తిప్పిన ధోని
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరిన నేపథ్యంలో మహేంద్ర ధోని పేరు మారుమోగుతోంది. అతడు చక్రం తిప్పడం కారణంగానే ఫైనల్స్ దాకా భారత్ చేరిందని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు ధోని అభిమానులు. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ చూసేందుకు ధోని ముంబై స్టేడియానికి వచ్చాడు. మ్యాచ్ పూర్తయ్యే వరకు తన భార్య సాక్షితో గ్రౌండ్ లోనే ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. అలాగే ఇన్నింగ్స్ గ్యాప్ సమయంలో, భారత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి కీలక సూచనలు చేశాడని ప్రచారం చేస్తున్నారు. అందువల్లే ఫైనల్స్ దాకా భారత్ దూసుకు వెళ్లిందని ధోని అభిమానులు పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. అటు తెలుగు కామెంట్రీ చేసే తిరుమల శెట్టి సుమన్ కూడా ధోని వల్లే ఇండియా గెలిచిందని పేర్కొన్నారు. అయితే ఇదంతా నచ్చని వాళ్ళు కౌంటర్లు కూడా పేల్చుతున్నారు. ధోని భజన షురూ చేశారని రివర్స్ అటాక్ చేస్తున్నారు.






