- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా ప్లేయర్ కారు ఆపి మరీ రచ్చ.. వీడియో వైరల్!
మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ( Team India) ఎన్నో

దిశ, వెబ్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ( Team India) ఎన్నో విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని... ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. మహేంద్ర సింగ్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్ అలాగే మాజీ క్రికెటర్లు. ఇటు.. స్నేహితులతో కూడా... ఇవాళ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు మహేంద్ర సింగ్ ధోని.
అయితే.. ఇలాంటి నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని అభిమానులు... ఆయన ఫామ్ హౌస్ ముందు రచ్చ చేశారు. ధోని అలాగే ఆయన భార్య ఇద్దరు కారులో బయటికి వెళ్తున్న నేపథ్యంలో.. అభిమానులందరూ ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా... ధోనీకి శుభాకాంక్షలు చెబుతూ బాగా... రచ్చ రచ్చ చేశారు. కాస్త కారుకు సైడ్ ఇవ్వాలని కోరినప్పటికీ.. అభిమానులు ఏమాత్రం పట్టించుకోలేదు. తమతో ఫోటోలు దిగాల్సిందేనని ధోనిని వేధించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరినీ.. తప్పించారు. దీంతో అక్కడి నుంచి ధోని వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.






