చిరు సినిమాలో వెంకీ ఒక్క‌డే కాదు, మ‌రో హీరో కూడా!

by velandi.Saikiran |   (  Updated:2025-10-19 05:00:31  IST  )

చిరంజీవి, బాబి కాంబినేషన్ లో రాబోతుంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ నటించబోతున్నట్లు

చిరు సినిమాలో వెంకీ ఒక్క‌డే కాదు, మ‌రో హీరో కూడా!
X

దిశ‌, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో దూసుకువెళ్తున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను రిలీజ్ చేసి, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత మెగా 158 సినిమాతో బిజీ కానున్నారు. ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబినేషన్ లో రాబోతుంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో వీరిద్దరూ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి కొత్త సినిమాతో రాబోతున్నారు. అయితే ఇందులో ఓ పవర్ ఫుల్‌ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

ఈ మేరకు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజను బాబీ బాగానే వాడాడు. ఇక్కడ అదే తరహాలో మోహన్ లాల్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు మోహన్ లాల్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు వేయనున్నాడు. ఇందులో ఒకరు రాశి ఖ‌న్నా అయితే, మరొకరు మాళవిక మోహనన్ అని సమాచారం. కాగా ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంద‌ట‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. కాగా అనిల్‌, చిరు కాంబోలో వ‌స్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు" మూవీలో వెంకీ మామ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.





Next Story