సిరాజ్ సంచలనం.. ఈ ఏడాది అత్యధిక వికెట్లు వీరుడిగా రికార్డు

by Harish |   (  Updated:2025-10-13 12:19:49  IST  )

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సత్తాచాటుతున్నాడు.

సిరాజ్ సంచలనం.. ఈ ఏడాది అత్యధిక వికెట్లు వీరుడిగా రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సత్తాచాటుతున్నాడు. రెండో టెస్టులో 3 వికెట్లు తీసిన అతను ఓ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రెండో టెస్టుకు ముందు జింబాబ్వే బౌలర్ ముజరాబాని 36 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. షాయ్ హోప్‌ను అవుట్ చేయడంతో సిరాజ్ అతన్ని వెనక్కినెట్టాడు. ఈ ఏడాది 8 టెస్టులు ఆడిన సిరాజ్ 37 వికెట్లు తీశాడు. 262.3 ఓవర్లు వేయగా అందులో రికార్డు స్థాయిలో 39 ఓవర్లు మెయిడెన్ వేశాడు. 3.79 ఎకానమీతో బౌలింగ్ చేసి 996 రన్స్ ఇచ్చాడు. రెండేసి సార్లు ఐదు వికెట్లు, నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు.

Next Story