- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
150 ఏళ్ల టెస్టు క్రికెట్.. స్పెషల్ మ్యాచ్‌ను ప్లాన్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
150 ఏళ్ల టెస్టు క్రికెట్‌ను పురస్కరించుకుని క్రికెట్ ఆస్ట్రేలియా స్పెషల్ మ్యాచ్‌ను ప్లాన్ చేసింది.

దిశ, స్పోర్ట్స్ : పురుషుల టెస్టు క్రికెట్ 2027తో 150 ఏళ్లను పూర్తి చేసుకోనుంది. 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. 150 ఏళ్ల టెస్టు క్రికెట్‌ను పురస్కరించుకుని క్రికెట్ ఆస్ట్రేలియా స్పెషల్ మ్యాచ్‌ను ప్లాన్ చేసింది. టెస్టు క్రికెట్ మొదలైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో పింక్ బాల్ టెస్టు నిర్వహించనుంది. ఇంగ్లాండ్‌తో ఆసిస్ డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. ఈ మ్యాచ్ 2027లో మార్చి 11 నుంచి 15 వరకు జరగనుంది. ఎంసీజీలో జరగబోయే మొట్టమొదట పురుషుల పింక్ బాల్ టెస్టు ఇదే కానుంది. ‘ఎంసీజీలో జరిగే 150వ వార్షికోత్సవ మ్యాచ్ గొప్ప క్రికెట్ ఈవెంట్లలో ఒక్కటిగా నిలువనుంది. ఆట వారసత్వం, ఆధునిక పరిణామాన్ని జరుపుకోవడానికి ఇది గొప్ప మార్గం.’అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్ తెలిపారు. 1977లో ఎంసీజీలోనే జరిగిన 100వ వార్షికోత్సవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.






