IPL 2025 : తిరిగి గుజరాత్ గూటికి చేరిన మాథ్యూ వేడ్.. ఈ సారి ప్లేయర్‌గా కాదు.. కోచ్‌గా

by Harish |

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఐపీఎల్‌లో తిరిగి గుజరాత్ టైటాన్స్ గూటికి చేరాడు.

IPL 2025 : తిరిగి గుజరాత్ గూటికి చేరిన మాథ్యూ వేడ్..  ఈ సారి ప్లేయర్‌గా కాదు.. కోచ్‌గా
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఐపీఎల్‌లో తిరిగి గుజరాత్ టైటాన్స్ గూటికి చేరాడు. 37 ఏళ్ల వేడ్ వచ్చే సీజన్‌లో గుజరాత్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవరించబోతున్నాడు. వేడ్ నియామకాన్ని ఫ్రాంచైజీ ఆదివారం ధ్రువీకరించింది. 2022లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో వేడ్ సభ్యుడు. ఆ సీజన్‌తోపాటు గతేడాది వేడ్ గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరపున 12 మ్యాచ్‌ల్లో 161 రన్స్ చేశాడు. గతేడాది అక్టోబర్‌లో వేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కోచ్‌గా కొత్త కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే గుజరాత్ వేడ్‌ను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకుంది. ఐపీఎల్‌లో అతను హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్, అసిస్టెంట్ కోచ్‌లు ఆశిష్ కపూర్, నరేందర నేగిలో కలిసి పనిచేయనున్నాడు. ఈ నెల 22 నుంచి లీగ్ ప్రారంభంకానుంది. ఈ నెల 25న గుజరాత్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.


Next Story