- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగి కెమెరాకు చిక్కిన బంగ్లాదేశ్ కోచ్..
అట్టహాసంగా ప్రారంభమైన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లీగ్‌లో ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అట్టహాసంగా ప్రారంభమైన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లీగ్‌లో ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లో నిలిచింది. ఈ లీగ్‌లో ఇప్పటికే ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్లతో తగవులాటలు, లైవ్ మ్యాచ్‌లోనే ఫ్లడ్‌లైట్స్ ఆరిపోవడం.. ఇలా ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లో నిలిచింది.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగానే డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఢాకా వేదికగా బీపీఎల్ లీగ్‌లో భాగంగా ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనే ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. కెమెరాలో రికార్డు కావడంతో కోచ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






