- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన లక్నో...సంజు లేకుండా బరిలోకి రాజస్థాన్ ?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. జైపూర్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. జైపూర్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే కాసేపటికి క్రితమే ఈ 36వ మ్యాచ్ టాస్ వేశారు. ఇందులో టాస్ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్.. మొదట ఫీల్డింగ్ చేయబోతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ కు రాజస్థాన్ కెప్టెన్ సంజు దూరమయ్యాడు. ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు... ఈ మ్యాచ్ కు దూరం అయినట్లు.. అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో రాజస్థాన్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ కొనసాగుతున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(c), నితీష్ రాణా, ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే






