- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జట్టు జెర్సీలో మెస్సి..ఫోటోలు వైరల్
జెర్సీని మొన్న మెస్సికి ఐసీసీ చైర్మన్ జై షా (Jay Shah) గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఇవాళ భారత జెర్సీని ధరించి

దిశ, వెబ్ డెస్క్: దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ( LionelMessi ) ఇండియా టూర్ కొనసాగుతోంది. ఈనెల 13వ తేదీన ఇండియాలో అడుగుపెట్టిన మెస్సి, కోల్ కతా, హైదరాబాద్, ముంబై నగరాల్లో పర్యటించారు. తాజాగా ఢిల్లీకి కూడా వెళ్లి సందడి చేశారు. అటు అంబానీ ఇంటికి వెళ్లి, శివుడి పూజలో కూడా పాల్గొన్నారు మెస్సి. హిందూమతం ఆచరిస్తూ, శివుడికి పూజలు కూడా చేశారు.
ఇక లేటెస్ట్ గా భారత జెర్సీని ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు మెస్సి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇటీవల భారత జెర్సీని లాంచ్ చేసింది బీసీసీఐ. అయితే ఆ జెర్సీని మొన్న మెస్సికి ఐసీసీ చైర్మన్ జై షా (Jay Shah) గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఇవాళ భారత జెర్సీని ధరించి ఫోటోషూట్ లో పాల్గొన్నారు మెస్సి. ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన పలువురు క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.






