- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన టీమిండియా.. ర్యాంక్ ఎంతంటే ?
టీమిండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య నిన్నటి వరకు జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో గిల్ ( Shuban Gill) సేన

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య నిన్నటి వరకు జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో గిల్ ( Shuban Gill) సేన అదరగొట్టింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టెస్టులో టీమిండియా దుమ్ము లేపింది. చివరి వరకు పోరాడిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( World Test Championship) పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని.. గతంలో లేని విధంగా మెరుగుపరుచుకుంది.
ఐదవ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి నాలుగో స్థానం నుంచి మూడవ స్థానానికి దూసుకు వెళ్ళింది టీమిండియా. అదే సమయంలో ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి దిగి రావాల్సి వచ్చింది. ఇక అటు ఇదే పట్టికలో ఆస్ట్రేలియా 36 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అంటే ఆస్ట్రేలియా 100% దూసుకు వెళ్తోంది. ఆ తర్వాత శ్రీలంక 16 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అటు టీమిండియా ఐదు మ్యాచ్ లలో రెండు గెలిచి 28 పాయింట్లు సాధించింది. దీంతో మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ నిలవగా బంగ్లాదేశ్ 5, వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉన్నాయి.






