ఇంగ్లండ్‌లో ఆడనప్పుడు చాలా నేర్చుకున్నా: కుల్దీప్ యాదవ్

by Phanindra |

ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ ఆడనప్పుడు తాను ఎంతో నేర్చుకున్నానని కుల్దీప్ యాదవ్ అన్నాడు. తాను బ్యాటింగ్‌పై కాకుండా ఎప్పుడూ స్పెషలిస్ట్ బౌలర్‌గానే ఆడతానన్నాడు.

ఇంగ్లండ్‌లో ఆడనప్పుడు చాలా నేర్చుకున్నా: కుల్దీప్ యాదవ్
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగి ఆడుతున్నాడు. భారత్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు కూడా. అలాంటి ప్లేయర్‌ను ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగించింది. దీనిపై తాజాగా కుల్దీప్ నోరు విప్పాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీసు సమయంలో తనకు కోచ్ గౌతం గంభీర్ ఇచ్చిన మెసేజ్ ఏంటో వెల్లడించాడు.

బ్యాటింగ్ చేయగలిగే స్పిన్నర్లకు అవకాశాలు ఎక్కువగా దక్కుతున్న సమయంలో కూడా తను స్పెషలిస్టు బౌలర్‌గానే ఆడతానని కుల్దీప్ స్పష్టంచేశాడు. బ్యాటింగ్ కాంబినేషన్స్ వల్ల తను ఆడలేకపోయానని, ఈ విషయంలో గౌతం గంభీర్ చాలా సూటిగా ఉన్న విషయం చెప్పేశాడని వెల్లడించాడు. అయితే తన స్కిల్స్ గురించో, బ్యాటింగ్ గురించో ఎప్పుడూ చర్చ రాలేదన్నాడు. అయితే మ్యాచ్‌లో ఆడని సమయంలో కూడా తాను ఎంతో నేర్చుకున్నానని, దాని వల్ల తను మరింత మెరుగైన ఆటగాడిగా మారానని చెప్పాడు.

Next Story