DC vs KKR : ముగిసిన కోల్‌కతా బ్యాటింగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

by Muthe.Rajitha |

మంగళవారం జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ లో కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ(DV vs KKR) మ్యాచ్ లో కేకేఆర్ 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

DC vs KKR : ముగిసిన కోల్‌కతా బ్యాటింగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ లో కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ(DV vs KKR) మ్యాచ్ లో కేకేఆర్ 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్‌కతా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. రఘువంశీ (44), రింకూ సింగ్ (36), నరేన్ (27), గుర్భాజ్ (26) పరుగులు చేశారు. ఇక ఢిల్లీ బౌలర్స్ లో స్టార్క్ , అక్షర్, విప్రజ్ చెరో రెండు వొకేట్లు తీయగా.. చమీర ఒక వికెట్ తీశాడు. 205 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరికాసేపట్లో బరిలోకి దిగనుంది.

Next Story