గిల్ ఇంకా చిన్నోడే.. టెస్టు కెప్టెన్‌గా ఆ క్రికెటరే సరైనోడు : భారత మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు

by Harish |

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ సరైన ఎంపిక అని టీమ్ ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.

గిల్ ఇంకా చిన్నోడే..  టెస్టు కెప్టెన్‌గా ఆ క్రికెటరే సరైనోడు : భారత మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ సరైన ఎంపిక అని టీమ్ ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏ రకంగా చూసుకున్నా రాహుల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాడు. ‘టెస్టుల్లో రాహుల్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. టాపార్డర్‌లో చాలా ముఖ్యమైన రన్స్ చేశాడు. విదేశాల్లోనే అతను ఎక్కువ సెంచరీలు చేశాడు. కాబట్టి, ఏ పరిస్థితుల్లోనైనా అతని సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. అతని అంత పెద్దవాడు కూడా కాదు. అతని వయసు ఇప్పుడు 31 లేదా 32 ఏళ్లు అనుకుంటా. రెండేళ్ల వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సర్కిల్‌ను పూర్తిగా ఆడగలడు.’అని చెప్పాడు. అలాగే, గిల్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఇంకా కుర్రాడేనని, అతని ముందు ఇంకా చాలా క్రికెట్ ఉందన్నాడు. ‘మీరు దీర్ఘకాలంగా ఆలోచిస్తుంటే పొరపాటు పడ్డట్టే. గిల్ చాలా చిన్నోడు. విదేశాల్లో రాణించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నిలకడగా రాణించడం అతని ముందున్న సవాల్. రాహుల్ ఉన్నప్పుడు ఇప్పుడే అతన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు.’ అని బంగర్ చెప్పుకొచ్చాడు.


Next Story