- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేఎల్ రాహుల్, నితీష్ రాణా విధ్వంసం.. ఈ సీజన్ లోనే అత్యధిక స్కోరు
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (150), నితీష్ రాణా (91) పరుగుల సునామీ సృష్టించారు. పంజాబ్ కింగ్స్‌పై 265 పరుగుల రికార్డు స్కోరు సాధించి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న రాహుల్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో డబుల్ డెక్కర్ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచులో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు బ్యాటర్లు కేఎల్ రాహుల్, నితీష్ రాణాలు బౌలర్లపై రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా ప్రతి బంతిని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 47 బంతుల్లో సెంచరితో రెచ్చిపోయి.. ఈ సీజన్ హాట్రిక్ సెంచరీల్లో తాను భాగస్వామి అయ్యారు. మరోపక్క నితీష్ రాణా కూడా రాహుల్ కి పోటిగా ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2026 సీజన్ హైఎస్ట్ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచులో రాహుల్ 152 పరుగులతో రెచ్చిపోగా నితీష్ రాణా 91 పరుగులు చేశాడు.
ఈ ఇద్దరు బ్యాటర్లు 200 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు. అలాగే నితీష్ రాణా 4 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు. అలాగే కేఎల్ రాహుల్ 16 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ సీజన్ లోనే వ్యక్తిగత హైఎస్ట్ స్కోరును రాహుల్ బ్రేక్ చేసి.. ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో పంజాబ్ బౌలర్లు పరుగులను సమర్పించుకొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచులో పంజాబ్ జట్టు గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 265 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఇంతటి భారీ స్కోరును చేదించి పంజాబ్ జట్టు మరోసారి చరిత్ర సృష్టిస్తుందో లేదో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.






