KKR vs GT : చెలరేగిన గిల్.. కోల్‌కతాకు భారీ టార్గెట్

by Muthe.Rajitha |

ఐపీఎల్ సీజన్లో భాగంగా నేడు గుజరాత్ తో కేకేఆర్(KKR vs GT) కు జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్(Shubhman Gill) చెలరేగిపోయాడు.

KKR vs GT : చెలరేగిన గిల్.. కోల్‌కతాకు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ సీజన్లో భాగంగా నేడు గుజరాత్ తో కేకేఆర్(KKR vs GT) కు జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్(Shubhman Gill) చెలరేగిపోయాడు. సోమవారం ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గిల్ కొద్దిలో సెంచరీ మిస్ అయినప్పటికీ.. 90 పరుగుల అద్భుత ప్రదర్శన చేశాడు. సాయి సుదర్శన్ 52, బట్లర్ 41 పరుగులతో అదరగొట్టారు. కోల్‌కతా బౌలర్స్ లో వైభవ్, రసెల్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. 199 పరుగుల భారీ లక్ష్యంతో కోల్‌కతా బరిలోకి దిగనుంది.

Next Story