- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: ఢిల్లీ సక్సెస్ వెనుక తెలుగోడు.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ( delhi capitals ) దూసుకు వెళ్తోంది. ఇప్పటి వరకు జరిగిన మ్య

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ( delhi capitals ) దూసుకు వెళ్తోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆరు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.... ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించి పది పాయింట్లు సాధించుకుంది. ఇదే ఊపు... మరో ఐదు మ్యాచ్ ల్లో కొనసాగిస్తే... ఫైనల్ కు వెళ్లడం కూడా సులభతరం అవుతుంది.
అయితే.. ఇలాంటి నేపథ్యంలో... ఢిల్లీ క్యాపిటల్స్ విజయ వెనుక తెలుగోడి పనితీరు ఉందని... సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ తెలుగోడు ఎవరో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ సహాయజమాని కిరణ్ కుమార్ గ్రంధి. జిఎంఆర్ గ్రూప్ వ్యాపార సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు కుమారుడే ఈ కిరణ్ ( DC Owner Kiran Grandhi). ఈయన ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఉన్నారుగా కూడా కొనసాగుతున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో... చాలా తెలివిగా వ్యవహరించి కీలక ప్లేయర్లను తక్కువ ధరకు కొనుగోలు చేశారు కిరణ్ ( kiran kumar).
కేఎల్ రాహుల్ ను 14 కోట్లు, స్టార్క్ ను 11.75 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. స్టబ్స్ ను 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ముగ్గురు ప్లేయర్లను తక్కువ ధరకు కొనుగోలు చేయడం వెనుక కిరణ్ హస్తం ఉంది. ఆయన తెలివిగా మెగా వేలంలో పాల్గొని... ఈ ముగ్గురిని దక్కించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా... ఈ ముగ్గురి కారణంగా జట్టు విజయం సాధించింది. దీంతో కిరణ్ కుమార్ పేరు వైరల్ గా మారింది.






