- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RSSలో చేరిన టీమిండియా క్రికెటర్..ఫోటోలు వైరల్ !
మహారాష్ట్రకు చెందిన కేదార్ జాదవ్...ఆర్ఎస్ఎస్ గెటప్ లో మెరిసారు

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ( Kedar Jadhav ) గురించి తెలియని వారుండరు. ధోని టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో వరుసగా ఛాన్సులు దక్కించుకున్నాడు కేదార్ జాదవ్. ఆ తర్వాత వరుస వైఫల్యాలు, కుర్ర ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురైన నేపథ్యంలో టీమిండియాకు దూరమైయ్యాడు. అనంతరం రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 2024 జూన్ 3న అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు కేదార్ జాదవ్.
అనంతరం బీజేపీ పార్టీలో చేరాడు. మహారాష్ట్రకు చెందిన కేదార్ జాదవ్...మహిళ క్రికెటర్ స్నేహల్ జాదవ్ ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే, భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గెటప్ లో మెరిసారు. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన యూనిఫాం వేసుకున్న కేదార్ జాదవ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బీజేపీలో చేరడమే కాకుండా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కోసం కేదార్ జాదవ్ పని చేస్తున్నాడని అంటున్నారు. ఒకప్పుడు క్రికెటర్ గా, ఇప్పుడు కార్యకర్తగా జాదవ్ ఎక్కడా తగ్గడం లేదని కొందరు మెచ్చుకుంటున్నారు. కాగా, 2014 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కేదార్ జాదవ్...దాదాపు 10 ఏళ్ల పాటు జట్టుకు సేవలు అందించాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కొచ్చి టస్కర్స్, సన్ రైజర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. క్లిక్






