- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KARUNG ANKHOLAR: మేరీకోమ్‌కు అతడితో ఎఫైర్ ఉంది.. మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ విజేత, ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ సంచలన ఆరోపణలు చేశారు. మేరీకోమ్‌కు జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేదని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: ఒలింపిక్స్ విజేత, ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ సంచలన ఆరోపణలు చేశారు. మేరీకోమ్‌కు జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేదని ఆరోపించారు. కుటుంబం సర్దిచెప్పినప్పటికీ మేరీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వాట్సాప్ ప్రూఫ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పాడు. ఆమె ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలని అనుకుందని.. అందుకే విడాకులు తీసుకుందని సంచలన ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారు అని మేరీకోమ్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.
భర్తపైనా మేరీకోమ్ ఆరోపణలు
ఇదిలా ఉంటే మేరీకోమ్ ఇటీవల తన విడాకులపై స్పందిస్తూ భర్తపై ఆరోపణలు చేశారు. తన భర్త ఆంఖోలర్ తనను ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపించారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ తనకు తెలియకుండా తన భర్త పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడని చెప్పారు. ఆయన చేసిన అప్పుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. 2022 కామన్ వెల్త్ గేమ్స్ సమయంలో గాయంతో విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ నిజాలు బయటపడినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు నిజాలు చెప్పక తప్పడంలేదన్నారు. ఈ నేపథ్యంలోనే మేరీకోమ్ భర్త ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తిరిగి ఆమెపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.






