కొందరిని పక్కన పెట్టడం కష్టమే.. జట్టు ఎంపికపై Rohith sharma

by Disha Web Desk 13 |
కొందరిని పక్కన పెట్టడం కష్టమే.. జట్టు ఎంపికపై Rohith sharma
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు నాగ్ పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. తుది జట్టు ఎంపికపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. "ఇది కఠినమైన నిర్ణయమే. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బాగా ఆడుతున్నారు. కొందరిని పక్కన పెట్టడం కష్టమే" అని రోహిత్ అన్నాడు. కండిషన్స్‌ను చూసిన తర్వాత అందుకు తగిన టీమ్‌ను ఎంపిక చేస్తామని చెప్పాడు.

మంగళవారం నాగ్‌పూర్ పిచ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో పిచ్ క్యూరేటర్ పిచ్‌పై అక్కడక్కడా నీళ్లు చల్లి, రోలింగ్ చేస్తుండటం పై జేసన్ గిలెస్పీ లాంటి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐసీసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. సిరీస్ ప్రారంభం కాకముందే పిచ్‌లపై ఆరోపణలు చేయొద్దన్నాడు.

ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరింత ఘాటుగా స్పందించాడు. ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండి అంటూ ఆస్ట్రేలియాకు చురకలు అంటించాడు. "పిచ్‌ను కావాలని మార్చాలన్న ఆరోపణలపై స్పందించాలంటే.. వచ్చే ఐదు రోజులు ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండనే నేను చెబుతాను. పిచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించవద్దు.

గత సిరీస్‌లోనూ పిచ్‌ల గురించి చాలా చర్చే జరిగింది. 22 మంది నాణ్యమైన ప్లేయర్స్ ఆడతారు. అందువల్ల పిచ్‌లు ఎలా ఉంటాయి.. ఎంత టర్న్ అవుతుంది.. ఎంత సీమ్ అవుతుంది అన్నది పక్కన పెట్టండి. మంచి క్రికెట్ ఆడండి గెలవండి అంతే" అని రోహిత్ అన్నాడు.

స్పిన్‌కు అనుకూలించే కండిషన్సే ఉంటాయని అనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. "ఓ ప్లాన్ ఉండటం ముఖ్యం. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. కొందరు స్వీప్ చేస్తారు, కొందరు రివర్స్ స్వీప్.. కొందరు బౌలర్ల తలపై నుంచి బాదుతారు. కొన్నిసార్లు స్ట్రైక్ రొటేట్ చేయాలి. కొన్నిసార్లు కౌంటర్ అటాక్ చేయాలి. కెప్టెన్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బౌలర్లను, ఫీల్డర్లను మారుస్తూ ఉంటారు. అందుకు తగినట్లు ప్లాన్ చేసి ఆడాలి" అని రోహిత్ చెప్పాడు.

Also Read...

ముందు దానిపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై ఆస్ట్రేలియా ఆరోపణలకు రోహిత్ శర్మ కౌంటర్

Next Story

Most Viewed